కామారెడ్డిలో ట్రయాంగిల్ డెత్ మిస్టరీ 

కామారెడ్డిలో  జిల్లాలో  ఎస్ఐ సాయికుమార్ , కానిస్టేబుల్ శృతి  , కంప్యూటర్ ఆపరేటర్  నిఖిల్  సదాశివనగర్ చెరువులో  దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే నిఖిల్ కూడా ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ఎస్ ఐ , కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధానికి నిఖిల్ కారకుడని తెలుస్తోంది.  ప్రస్తుతం ఎస్ ఐ డెడ్ బాడీ దొరకకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్ ఐ కారు చెరువు కట్ట వద్దే ఉంది. 

  బిక్కనూర్ ఎస్ ఐ సాయికుమార్ బీబీనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సాయికుమార్ బీబీపేట ఎస్ఐ గా పని చేస్తున్న సమయంలో శృతితో ఎఫైర్ ఉన్నట్టు వినికిడి.   సాయికుమార్ బిక్కనూర్ కు బదిలీ కావడంతో వీరిరువురి మధ్య గ్యాప్ ఏర్పడింది. శృతికి గతంలో పెళ్లి జరిగింది. కానీ భర్తతో విడిపోయి సాయికుమార్ తో ప్రేమాయణం నడిపించింది. 
నిఖిల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని శృతి వత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా ? అనేది తేలాల్సి ఉంది. ముగ్గురు ఒకే సారి సుసైడ్ చేసుకుంటే ఒకే సారి డెడ్ బాడీలు బయటపెడతాయి. కానీ అలా జరుగలేదు. కేవలం రెండు మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. నిఖిల్ , శృతిలను సాయికుమార్ చంపేసి పరారైనట్లు మరో కథనం వినిపిస్తోంది.