మ‌హిళ‌పై అంబ‌టి అరాచ‌కం.. భ‌గ్గుమంటున్న మ‌హిళాలోకం..

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తమపై ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా  వైసీపీ ఫైర్ బ్రాండ్ ల్లో ఒకరైన ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన నిర్వాకం తీవ్ర వివాదస్పదమవుతోంది. 

ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఒక సామాజిక వర్గాన్నికించపరిచారనే ఆరోపణలు రావడంతో.. వెనక్కు తగ్గి  క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఆస్తి, చెత్తపన్ను పెంపుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో మున్సిపల్ ఆఫీసు మెట్లకు అడ్డంగా బైఠాయించి సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. అప్పుడే కౌన్సిల్ హాల్ కు వచ్చిన అంబటిని సీపీపీ కార్యకర్తలు నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

అయితే చెత్తపై పన్ను విధించడం, ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగిన సిపిఎం శ్రేణులతో వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దారుణంగా వ్యవహరించారు. సత్తెపల్లి మున్సిపల్ కార్యాలయంలోకి ఎమ్మెల్యేను వెళ్లనివ్వకుండా నిరసనకారులు అడ్డుగా కూర్చోగా... వారిని తొక్కుకుంటూ ఆయన ముందుకు వెళ్లారు. మహిళలు అనికూడా చూడకుండా నిరసనకారులను పక్కకు తోస్తూ, కాళ్లతో తొక్కుకుంటూనే ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా ముందుకు వెళ్లారు. 

ఎమ్మెల్యే తీరుతో షాక్ తిన్న ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అంబటి తీరుపై సిపిఎం నాయకులు మండిపడుతున్నారు.  సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే అంబటి.రాంబాబు తోపాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్స్ పై తమపై దాడిచేసికోట్టి,అసభ్యంగా దూషించారని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆఫీసు వద్ద ఆస్థిపన్ను ఉపసంహరించాలని ఆందోళన చేస్తున్న తమపై మహిళలనే గౌరవం లేకుందా,అసభ్యంగా దూషిస్తూ, దాడి చేసి కోట్టిగాయపరిచారని తమ ఫిర్యాదులో ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగించారనే కారణంగా ధర్నాకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు స్టేషన కు తరలించారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.