క్షుద్రపూజల భయంతో.. బయటికిరాని గ్రామ ప్రజలు.. 

పల్లెటూరు అంటే పది , పన్నెండు గాక గాలి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు..కానీ  రెండు రోజులుగా ఆ ఊరు అంత నిశ్శబ్దం.. ఇంటి తలుపులు వేసుకుని కనీసం బయటికి కూడా రావట్లేదు. అలా అని ఆ ఊరిలో కరోనా వచ్చిందేమో అనుకునేరు కాదు.. ఆ గ్రామ ప్రజలను ఒక భయం వెంటాడుతోంది. ఇంతకీ ఆ ఊరి పేరు ఏంటని అనుకుంటున్నారా..ఆ ఊరి పేరే కదంబాపూర్. మరి ఆ గ్రామా ప్రజలను వెంటాడే భయం ఏంటని అనుకుంటున్నారా..? ఇంగ్లీష్ లో బ్లాక్ మేజిక్ అంటారు. సాంస్కృతంలో  క్షుద్రపూజలంటారు. తెలుగులో చేతబడి అంటారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఒక వైపు చంద్రమండలంలోకి అడుగుపెడుతున్నారు. మరో వైపు అంతరిక్షం లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేస్తున్నారు.  టెక్నాలజీ తో ప్రపంచం దూసుకుపోతుంటే కూడా ఇంకా జనం మూఢనమ్మకాల ఊబి నుంచి బయటకు రావట్లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అశోక్‌నగర్ సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద రాత్రిపూట కోడిని బలిచ్చారు. నిమ్మకాయలు, కోడిగుడ్డు, అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి క్షుద్ర పూజలు చేశారు. ఎవరో  గుర్తుతెలియని వ్యక్తులు. ఊరిబయట అర్ధరాత్రి క్షుద్రపూజలు, చేతబడి చేయడంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే కూడా భయాందోళన చెందుతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లేవాళ్లు కూడా హడలిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాలు చేతులో పట్టుకుని ఇళ్లలో దాకుంటున్నారు. 

ముఖ్యంగా ఆదివారం, గురువారాలు వచ్చాయంటే చాలు మూడు రోడ్లు కలిసిన చోట క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. ఆషాఢమాసంలో క్షుద్రపూజలు, చేతబడి ఆనవాళ్లు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకోకుండా వాటిపై నుంచి దాటడంతో అనారోగ్యానికి గురవుతామని అనుమానంతో జనం భయపడిపోతున్నారు. ఈ ఘటనపై అటు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు జనవిజ్ఞాన వేదిక లాంటి స్వచ్చంద సంస్థలు ఇలాంటి మూఢ నమ్మకాలపై యెంత అవగాహనా కలిపించిన ప్రజలు భయభ్రాంతులకు గురైతున్నారు.  ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా మంత్రగాళ్లు క్షుద్రపూజలు, చేతబడి పూజలు చేయడం మానడం లేదు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఇంకా మంత్రాలు, క్షుద్రపూజలు అంటూ ఎక్కడికి వెళ్తున్నామని విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టుకుని, కేసు నమోదు చేయాలని, మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేదా రోడ్లు కలిసే కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ల ఆట కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.