రాష్ట్రానికి వైసిపి వైరస్, టిడిపినే వ్యాక్సిన్..చంద్ర‌బాబు

ఒక వంక వ‌ర్షాలు, మ‌రో వంక ప‌ల్నాడు మ‌హానాడు అయినా తెలుగు దేశం అధినేత ప‌ల్నాడు గుర‌ జాల‌లో పంట‌ల న‌ష్టాలతో దిగులుప‌డుతున్న రైతాంగాన్ని ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చారు. బుధ‌వారం రాత్రి ఎంతో స‌మ‌య‌మ‌యినా ప్ర‌జ‌లు ఆయ‌నను విన‌డానికి స‌భ‌కు విచ్చేశారు. వేలాదిమంది ఎంతో ఉత్సా హంగా పాల్గొన్న‌స‌భ‌లో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వైసీపీ వైర‌స్‌లా ప‌ట్టు కుంద‌ని తెలుగుదేశ‌మే దాన్ని వ‌దిలించే వాక్సిన్ అంటూ అభివ‌ర్ణించారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వైసీపీ భూస్థాపితం ఖాయ‌మ‌ని నిన‌దిస్తూ, చంద్రబాబు  పార్టీ అభిమానుల‌ను, ప్ర‌జ‌ల‌ను  ఉత్సాహ‌ ప‌రిచారు.

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వంతో విసిగెత్తిన ప్ర‌జ‌లు టీడీపీ అధికారంలోకి రావాల‌ని ఎంతో ఉత్స‌హం ప్ర‌ద ర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు రావాల‌ని గ‌ట్టిగా ఆశిస్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎంతో హృద‌య‌పూర్వ‌కంగా ఆహ్వానిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఘ‌న స్వాగతం ప‌లుకు తున్నారు. ప‌ల్నాడు గుర‌జాల స‌భ‌లో మాట్లాడుతూ, వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు, ముఖ్యంగా రైతాంగం ఎంతో న‌ష్ట పోతోంద‌ని, వారిని క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా అధికారుల‌కు, మంత్రుల‌కు తీరిక‌లేదా అని ప్ర‌శ్నిం చారు.  మిరప, పత్తి పంటలకు వర్షాల కారణంగా గరిష్టంగా లక్ష రూపాయల నష్టం వచ్చింది. సిఎం తాడే పల్లి ప్యాలెస్ లో కూర్చుంటే బాధలు తెలియవని, ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడాల‌ని ప్ర‌భుత్వాన్ని ఎద్దేవా చేశారు. 

హుద్‌హుద్ తుపాను స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోలేద‌ని, ప్ర‌జ‌ల‌ను ఆ స‌మ‌యంలో ఎలా ఉన్నార‌ని ముందుగా వెళ్లి ప‌ల‌క‌రించి వారి స‌మ‌స్య‌లు, క‌ష్టాలు తామే తెలుసు కున్నామ‌ని చంద్ర‌బాబు అన్నారు. అస‌లా మాట‌కు వ‌స్తే ఏ విప‌త్తు స‌మ‌యంలోనూ ముఖ్య‌మంత్రి స్పందించిన దాఖలాలు లేవ‌న్నారు. 

పల్నాడు ప్రాంతంలో 157 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు,  దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఎపి మూడవ స్థానంలో ఉందని, జగన్ మోసాలు చెయ్యడంలో దిట్ట, కడుపు అబద్దాల పుట్ట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మే ఉంద‌ని, వారికి వ‌చ్చే స‌బ్జిడీలు నిలువ‌రించ‌డ‌మే అందు కు గొప్ప ఉదాహ‌ర‌ణ అనీ  బాబు అన్నారు. అంతేకాదు, స్కూళ్ల‌లో నాడు నేడు అనే కార్య‌క్ర‌మంతో వ‌చ్చి న గొప్ప ఫ‌లితాలేమీ లేవ‌ని అన్నారు. 

వై.ఎస్‌. వివేకా హత్యలో ఆయన కుమార్తె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. వివేకా హత్యపై నారాసుర రక్త చరిత్ర అని నాడు రాశారు. అప్పుడు సిబిఐ విచారణ కావాలి అన్నాడు...ఇప్పుడు అవసరం లేదని అంటున్నార‌ని, జగన్  ఈ వైఖరిప‌ట్ల  బాధతో సునీత పట్టుదలతో పోరాడుతున్న‌ద‌ని బాబు అన్నారు. ఒక  సిఐకి ప్రమోషన్ ఇచ్చి...వివేకా కేసులో సాక్ష్యం చెప్పకుండా చేయ‌డం దారుణ‌మ‌న్నారు. 

జ‌న‌సేన అధినేత  పవన్ కళ్యాన్ పై తీవ్రంగా దాడి చేశారు..పవన్ చెప్పు చూపించాడు అంటే ఎంత వేదన చెందాడో ఆలోచించాలని చంద్ర‌బాబు అన్నారు. త‌న కుటుంబంపై దాడిచేసిన‌పుడు గెలిచిన త‌ర్వాత‌నే స‌భ‌కు వ‌స్తాన‌ని చెప్పాన‌ని, అధికారం ఉంద‌ని విర్ర‌వీగడం, పెంపుడు కుక్క‌ల‌ను త‌మ‌పై దాడి చేయిం చ‌డం ఇక స‌హించేది లేద‌ని చంద్ర‌బాబు వైసీపీని హెచ్చ‌రించారు. 

నాడు హైదరాబాద్ ను అభివృద్ది చేస్తే తరువాత వచ్చిన వైఎస్ ఆర్ అడ్డుపడలేదు...నాశనం చెయ్య లేదు, రాజశేఖర్ రెడ్డి నాడు అడ్డుపడి ఉంటే హైదరాబాద్ అభివృద్ది ఏమయ్యేది రాష్ట్రానికి ఎవరూ చేయ ని అన్యాయం జగన్ చేశాడని టీడీపీ అధినేత మండిప‌డ్డారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu