దళిత మహిళలపై కారు దూకించిన గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి

గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌ని పరిశీలించేందుకు కిలారు రోశయ్య  వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడేందుకు స్థానిక మహిళలు ప్రయత్నించారు. దాంతో ఆవేశపడిపోయిన రోశయ్య కారుతో మహిళల మీదకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళల మీద దాడి చేయాలంటూ తన అనుచరులను ఆదేశించారు. దాంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu