కేతిరెడ్డికి ప్రజానిరసన సెగ!

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి జనం తిరుగుబాటు సెగ గట్టిగా తగిలింది. అధికారం ఉందికదా అని ఈ ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయనను భయంతో భరించిన జనం ఇప్పుడు ఎన్నికల వేళ గట్టిగా బుద్ధి చెప్పారు.

ఓ పొలింగ్ బూత్ వద్దకు వచ్చి ప్రజలను బెదరించి ఓటు వేయించుకోవాలని చూసిన ఆయనకు జనం తిరగబడి నిలదీశారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

తాడిపత్రి ఎమ్మెల్యే తనకు ఓటు వేయకపోతే నరికేస్తానంటూ చేసిన హెచ్చరికకు జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తీవ్ర ఆగ్రహంతో జనం ఆయనపై తిరగబడ్డారు. జనాగ్రహాన్ని ఒకింత ఆలస్యంగానైనా గుర్తించిన కేతిరెడ్డి అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu