ఆరోగ్యమే జీవితానికి  రక్ష.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..!


జీవితంలోని ప్రతి అంశం ఆరోగ్యం కారణంగా ప్రభావితమవుతుంది, దీర్ఘాయువు ఉన్నప్పుడు  ఆనందం,  సంతోషం కూడా ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనిషి ఆరోగ్యం  అనే విషయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు కూడా చాలా ముఖ్యం.  వివిధ వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు నేటి కాలంలో చాలా పెరుగుతున్నాయి.  ఈ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ,  ఆరోగ్య సమస్యలకు తగిన చర్యలు తీసుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడూ కీలకంగా ఉంటుంది.    ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ ఆరోగ్య దినోత్సవం ఎలా ఏర్పాటైందో.. దీని ఉద్దేశాలు ఏంటో తెలుసుకుంటే..

 1950 లో ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు  "ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు" అనే థీమ్ ను ఏర్పాటు చేశారు.  మరణాలను అడ్డుకోవడానికి,  తల్లులు,  నవజాత శిశువుల ఆరోగ్యం దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండటానికి,  తల్లి బిడ్జల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే కార్యక్రమాలు నిర్వహించడానికి,  దీనికి తగిన నిధుల ఏర్పాటుకు పిలుపునిస్తోంది.

ఇదీ చరిత్ర..

1948లో మొదటి ఆరోగ్య సభలో ప్రారంభమైనప్పటి నుండి,  1950లో అమల్లోకి వచ్చినప్పటి నుండి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన ప్రాధాన్యతను  ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారు.  ప్రభుత్వ జోక్యం లేకుండా స్వయంప్రతిపత్తితో పనిచేయడానికి,  ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.   ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపన జ్ఞాపకార్థం ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించారు.
 
గత 50 సంవత్సరాలుగా ఇది మానసిక ఆరోగ్యం, తల్లి,  శిశు సంరక్షణ,  వాతావరణ మార్పు వంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి అందరినీ ఒక్కటి చేయడం,  అవగాహన పెంచడం దీని లక్ష్యాలు. ఇటీవలి కాలంలో మానసిక ఆరోగ్యం,  మాతా శిశు ఆరోగ్యం,  వాతావరణ మార్పులు,  వివిధ ఆరోగ్య పరిస్థితులు,  వ్యాధులు మొదలైన వాటి గురించి కార్యాచరణ పెరిగింది.  ఆరోగ్యమే జీవితానికి రక్ష అని అంటారు.  ఆ ఆరోగ్యం అందరికీ లభించాలని,   ఆరోగ్య సౌకర్యాలు అభివృద్ది చెంది అందరికీ అందుబాటులోకి రావాలని ఈ రోజు కృషి చేస్తుంది.  మనషి తన చేతిలో ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది.


                                   *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu