చెట్టు కొమ్మ విరిగి పడి మహిళ మృతి

విధి రాత ఎవరూ తప్పించలేరన్న నానుడి ఆ మహిళ విషయంలో అతికినట్లు సరిపోతుంది.  కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. సరిగ్గా అలాగే జరిగింది విశాఖకు చెందిన పూర్ణిమ అనే మహిళ విషయంలో. నక్కలపాలెంలో నివాసం ఉంటున్న ఎస్బీఐ ఉద్యోగి భార్య పూర్ణిమ  తన ఇంటికి సమీపంలోనే ఉన్న బజారుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. . ఆమె వెడుతుండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి ఆమెపై పడింది.

దీంతో పూర్ణిమ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది.  ఊహించని ఈ పరిణామంతో పూర్ణిమ కుటుంబ సభ్యులు విషాద సంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకూ తమతో నవ్వుతూ మాట్లాడి.. అంతలోనే ప్రమాదం బారిన పడి పూర్ణిమ మరణించిందంటూ భోరున విలపిస్తున్నారు. చాలా కాలంగా రోడ్డు పక్కన ఉన్న ఆ చెట్టు కొమ్మ ప్రమాదకరంగా వంగి విరిగిపడేటట్లుగా ఉన్నప్పటికీ జీవీఎంసీ సిబ్బంది పట్టించుకోలేదన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu