అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు.. చంద్రబాబు, జగన్ దిగ్భ్రాంతి

సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో మార్క్ శకంర్ తో పాటు పలువురు విద్యార్థలు గాయపడ్డారు. కాగా పవన్ కల్యాణ్ కుమాడురు అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తదితరులు తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు.

మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలియగానే చాలా ఆందోళన చెందానని ఎక్స్ వేదికగా పేర్కొన్న ముఖ్యంమంత్రి చంద్రబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మంత్రి లోకేష్ కూడా పవన్ కల్యాణ్ కుమారుడు అగ్ని ప్రమాదఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో పవన్ కల్యాణ్ కు ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ కుమారుడికి గాయలపై  స్పందించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.  అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా పవన్ కుమారుడికి గాయలపై ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.