కాళేశ్వరం పై చర్చకు కేసీఆర్ వస్తారా?.. రేవంత్ వ్యూహానికి చిక్కుతారా

 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు  హాజరవుతారా లేదా అనేదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.  కమిషన్ నివేదికలో ప్రధానంగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. దీనిపై ఇప్పటికే కేసీఆర్ తనను కలసిన నేతల వద్ద మనోగతాన్ని వెల్లడించారు. అది కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ నివేదికని కేసీఆర్  వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి అరెస్ట్ లు కూడా జరగవచ్చని ప్రిడిక్ట్ చేశారు.  ఈ నేపథ్యంలో  కేసీఆర్ అసెంబ్లీ లో చర్చకు హాజరవుతారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అసెంబ్లీకి హాజరుకాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఒక వేళ అసెంబ్లీకి హాజరై చర్చలో పాల్గొంటే..  వెళితే తాను వివరణ ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే కేసీఆర్ కూర్చోవాల్సి ఉంటుంది. దీనిని కేసీఆర్ భరించగలుగుతారా?   తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ ను పూర్తికాలం సభనుంచి సస్పెండ్ చేశారు. అదే రేవంత్ రెడ్డి సభానాయకుడి స్థానంలో ఉండగా కేసీఆర్ సభకు హాజరై కాళేశ్వరం కమిషన్ చర్చలో పాల్గొంటారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. రేవంత్ కూడా కేసీఆర్ ను సభకు ఏదో రకంగా రప్పించాలనే వ్యూహంతో ఉన్నారు.

జానారెడ్డి, ఉత్తమ్, భట్టి లాంటి వాళ్లనే సభలో నోరు ఎత్తకుండా చేసిన కేసీఆర్..  నేడు సభకు వస్తే అదే సీను తనకు రిపీట్ అవుతుందన్న భయం కూడా కేసీఆర్ లో లేకపోలేదంటున్నారు.  సభలో చర్చ కన్నా రచ్చే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారా ? రారా? అన్నది ఆసక్తిగా మారింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu