ఎన్నికల వేళ.. ఘర్షణలు, దాడులు.. పలు గ్రామాల్లో ఉద్రిక్తత

రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్  సందర్భంగా కొన్ని  గ్రామాలలలో ఘర్షణ వాతావరణం నెలకొంది.   నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్‌పేట్‌ లో సర్పంచ్ ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంచుతున్నారంటూ ఆరోపణలు గుప్పించుకుంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారీని చెదరగొట్టి పోలింగ్ కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జి చేశారు.  
ఇక ఖమ్మం జిల్లా కొ కొండవనమాల లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న అర్ధరాత్రి   వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఈ ఉదయం పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

రాజకీయకక్షతోనే ప్రత్యర్థులు తన ఇల్లు దగ్ధం చేయడానికి ప్రయత్నించారంటూ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   సరే ఈ ఘటన కారణంగా పోలింగ్ సమయంలో ఘర్షణలు తలెత్తకుండా గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంద. అదే విధంగా  నల్గొండ జిల్లా  కొర్లపహాడ్‌ గ్రామంలో  పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక ర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. పోలింగ్ కొనసాగుతోంది. గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu