కొడాలి నాని ఎక్కడా?.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడా?
posted on Apr 29, 2022 6:10AM
పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. కాదు.. ఫైర్ అంటూ హీరో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్.. దేశ ప్రజలను ఓ ఊపు ఊపిపారేసింది. ఎవరి నోట విన్నా.. ఇదే డైలాగ్.. ఈ డైలాగ్ అలా ఇలా కాదు.. పుష్పలో ఫైర్‌లాగా గట్టిగానే పేలింది. అయితే తాజాగా మాజీ మంత్రి అయిన కొడాలి నాని అంటే కూడా ముమ్మాటికి ఫైరే అని ఆయన ఫ్యాన్స్ గుడివాడ నియోజకవర్గంలో మరీ బల్లగుద్దీ చెబుతారు. మంత్రిగా కొడాలి నాని ఈ మూడేళ్లలో ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో కొడాలి నానిని.. ఒకానొక దశలో.. బూతుల సరఫరా శాఖ మంత్రి, బూతుల మంత్రి అని ట్యాగ్ లైన్ కూడా తగిలించేశారీ ప్రజలు. అలాంటి ఫైర్..ఫైరింగ్ ఉన్న తమ నాయకుడు ప్రస్తుతం ఇలా సైలెంట్‌గా ఉండడం అటు గుడివాడ నియోజకవర్గ ప్రజలు.. ఇటు ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేక... వేసవి తాపంతో అల్లాడిపోతున్నట్లు.. అల్లాడిపోతున్నారు.
కొడాలి నాని కళ్లలో మళ్లీ ఫైరింగ్ చూడాలని వారంత వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవికీ రాజీనామా చేసే.. కొద్ది రోజుల ముందు కొడాలి నాని స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి.. మంత్రి పదవి తనకు లెక్క కాదని.. మంత్రి పదవి లేకుంటే.. తన విశ్వరూపం చూపిస్తానంటూ ఆయన క్లియర్ కట్‌గా చెప్పకనే చెప్పారు. ఈ మాటలతో.. కొడాలి నాని ఫ్యాన్స్.. ఓ రకంగా చెప్పాలంటే పండగే చేసుకొంది. కానీ మాజీ మంత్రి అయిన తర్వాత తమ ఆరాధ్య దైవం.. కొడాలి నాని విశ్వరూప విన్యాసం కోసం.. నియోజకవర్గంలో ఆయన ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చూస్తోంది.
కొడాలి నానికి స్వతహాగా దూకుడు ఎక్కువా.. అలాంటి ఆయనకు మంత్రి పదవి దక్కడంతో.. ఆయన ఓ రెంజ్‌లో చెలరేగిపోయారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మూడేళ్లలో కొడాలి నాని.. ఏ ప్రెస్ మీట్ పెట్టి.. పైర్ అయినా.. ఫైరింగ్ అయినా.. సదరు ఫ్యాన్స్.. గుడివాడ పట్టణ రహదారులపై పెద్ద పండగా చేసుకున్నారనే ఓ టాక్ అయితే నాడే కాదు... నేడు కూడా హాట్‌హాట్‌గానే నడిచింది.. నడుస్తోంది. మంత్రి పదవిలో ఇంత హాడావుడి చేసిన తమ నాయకుడు ఇలా మౌన మునిలా ఉండడం చూసి వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తన జన్మదినం సందర్బంగా ఇటీవల మాజీ మంత్రి కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. దీనిపై కొడాలి నాని.. తనదైన శైలిలో స్పందిస్తారని ఆయన ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసింది. కానీ కొడాలి నాని స్పందించ లేదు. మరోవైపు తెలంగాణలోని నిజమాబాద్ నగరంలో.. ఓ సభలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని ఒరేయ్ అంటూ సంభోదిస్తూ.. ఆయనపై విమర్శలు చేశారు.
అప్పుడన్నా కొడాలి నాని రంగంలోకి దిగి ఘాటుగా స్పందిస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశగా ఎదురూ చూసింది. కానీ కొడాలి నాని మాత్రం తన మౌన వ్రతాన్ని మాత్రం విడిందీ లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరుత్సాహాంలోకి సరున్న జారీపోయింది. తనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబును లైట్ తీసుకున్నా.. కొడాలి నాని ఇష్ట దైవం.. ఇంకా చెప్పాలంటే ప్రాణానికి ప్రాణమైన సీఎం వైయస్ జగన్‌పై రేణుకా చౌదరి విమర్శలను ఖండించకపోవడం పట్ల.. సదరు ఫ్యాన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా తమ అరాధ్య దైవం.. కొడాలి నాని తన విశ్వరూప విన్యాసం ప్రదర్శించాలని.. ఆయన ఫ్యాన్స్ మనసా వాచా కర్మణా కొరుకుంటున్నారు. అందుకోసం ఆయన ఫ్యాన్స్ వెయిటింగ్.