నారా లోకేశ్‌పై వైసీపీ కుక్కల రాళ్ల దాడి..
posted on Apr 28, 2022 6:26PM
వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. అధికార పార్టీ అనే బలుపుతో చెలరేగి పోయాయి. హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నారా లోకేశ్‌పై దాడికి తెగబడ్డాయి వైసీపీ గుండాలు. రాళ్ల దాడితో బీభత్సం సృష్టించారు. తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. రెచ్చిపోయిన మూకలంతా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు.
వైసీపీ శ్రేణుల రాళ్ల దాడితో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి రణరంగమైంది. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం సాయంత్రం తుమ్మపూడి వెళ్లారు. టీడీపీ వారితో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం తోసుకున్నారు. ఒక్కసారిగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నారా లోకేశ్ మీదకు వైసీపీ మూకలు రాళ్లు విసరడంతో.. ఆయన వెంటనే అలర్ట్ అయ్యారు. ఓ రాయి లోకేశ్ పక్కనే పడింది. వైసీపీ శ్రేణులను పోలీసులు అతికష్టం మీద అడ్డుకున్నారు. దీంతో, పెను ప్రమాదమే తప్పింది. రాళ్ల దాడిలో ఎస్ఐ తల పగిలింది. ఎమ్మెల్యే ఆర్కే కారు డ్రైవర్ ప్రత్యక్షంగా ఈ దాడిలో ఉండటంతో.. ఆళ్ల రామకృష్ణరెడ్డినే లోకేశ్ మీదను తన అనుచరులను ఉసిగొలిపారని టీడీపీ నేతలు ఆరోపించారు.
రాళ్ల దాడిపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ కుక్కలు తనపై రాళ్లు వేసేందుకు ప్రయత్నించారని.. వైసీపీ కుక్కల రాళ్ల దాడికి టీడీపీ భయపడబోదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షలు పరిహారం అందిస్తామన్నారు లోకేశ్.

