సంబరాల్లో టీఆర్ఎస్.. ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్


వరంగల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగతూనే ఉంది. అన్ని నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు అప్పుడే బాణసంచా కాలుస్తూ సంబరాలు మొదలుపెట్టారు. మరోవైపు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ.. మరింత స్ఫూర్తితో పనిచేస్తామంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అప్పుడే ట్విట్టర్లో ట్వీట్ కూడా పోస్ట్ చేశారు.

ఇప్పటివరకూ వచ్చిన ఓట్లు గమనిస్తే

టీఆర్ఎస్ - 3,69,436
కాంగ్రెస్ - 93,639
బీజేపీ - 63,706
వైసీపీ - 7,162