భారత ఆసియా దేశాల వారధిగా బౌద్ద పర్యాటకం

ఎబిటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు  మల్లేపల్లి లక్ష్మయ్య

పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు  ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని  మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం (మే 17) భూటాన్ లోని థింపూలో జరిగిన బంగ్లాదేశ్ భూటాన్ లోనిథింపూలో జరిగిన బంగ్లాదేశ్, భూటాన్ , ఇండియా, నేపాల్ , మయన్మార్(బిబిఐఎన్ఎమ్) దేశాల పర్యాటక సమాఖ్య, అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్ట్ టూర్ ఆపరేటర్స్ (ఏబీటీవో) సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియా రహదారిపై బౌద్ద పర్యాటకం’ అన్న సదస్సుకు ఆయన ఏబీటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్ష హోదాలో  ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. 

తెలంగాణలోని ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలాలతో పాటు  బుద్ద వనాన్ని  ఆసియాదేశాలకు పరిచయం  చేసి, అధిక సంఖ్యలో బౌద్ద పర్యాటకులను తెలంగాణకు రప్పించటానికి ఏబీటీవో ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసిందని సంబంధిత దేశ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించిందని అన్నారు. 
ఏబీటీవో ప్రదానకార్యదర్శి డాక్టర్ కాలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను  వివరిస్తూ  ఆసియా హైవే 2025 చివరకు అందుబాటులోకి వస్తుందన్నారు. 

స్థానిక ఏబీటీవో అధికార ప్రతినిధులు పరశురాం, మణి, ట్రావెల్ ఏజెంట్లు , టూర్ ఆపరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో మల్లే పల్లి లక్మయ్య, త్వరలో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి  భూటాన్ వరకు అంతర్జాతీయ హపీనెస్ యాత్ర( ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ మార్చ్ )  నిర్వహించటానికి భూటాన్ బౌద్ద సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu