మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సరికొత్త పార్టీ.. హిస్టరీ రిపీట్ 

ఇడియట్ సినిమాలో రవితేజ(ravi teja)డైలాగ్ ఒకటి ఉంటుంది. సిటీకి ఎంతో మంది పోలీసులు వస్తుంటారు, పోతుంటారు. కానీ చంటి గాడు లోకల్ అని. మెగాస్టార్ చిరంజీవి కి ఆ డైలాగ్  పర్ఫెక్ట్ గా సూటవుతుంది. తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు, పోతుంటారు, కానీ చిరంజీవి(chiranjeevi)మాత్రం ఒక్కడే.  లేటెస్ట్ గా ఆయన ఒక పాత సంప్రదాయానికి తెరలేపారు.

సినిమాకి సంగీతం  చాలా ఇంపార్టెన్స్. అది ఎంతలా అంటే సినిమా ఎలా ఉన్నా కూడా  పాటలు బాగుంటే చాలు.  సినిమా సక్సెస్. ఇది చాలా సందర్భాల్లో రుజువయ్యింది.అందుకే సినిమా విజయంలో సంగీతం చాలా  కీ రోల్ పోషిస్తుంది. అందుకే పాత రోజుల్లో  సంగీత దర్శకుడు ఒక పాటకి బాణీలని సమకూర్చేటప్పుడు  హీరోతో పాటు దర్శకుడు, నిర్మాత  అలాగే చిత్ర ప్రధాన తారాగణమంతా సిట్టింగ్ లో  కూర్చునేది. అప్పుడు సంగీత దర్శకుడు రకరకాల బాణీలని  వినిపించేవాడు. అలా అందరు విని ఏ ట్యూన్ బాగుంటే ఆ ట్యూన్ ని ఒకే చేసేవారు. ఇప్పుడు ఈ సిస్టం లేదు. కానీ చిరంజీవి ఈ ఆనవాయితీకి పునర్జన్మని ఇస్తున్నాడు.

 

తన కొత్త మూవీ విశ్వంభర (Vishwambhara)కి సంబంధించి సంగీత దర్శకుడు కీరవాణి (keeravani)తో పాటూ అందరు కూర్చున్నారు. పైగా అదంతా  చిరు తన  ఇంట్లోనే ఏర్పాటు చేసాడు. కీరవాణి తో పారు సుమారు ఇంకో పదిహేను మంది దాకా ఉన్నారు. ఈ సందర్భంగా ఆపద్భాంధవుడు మూవీలోని చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండి దారికి అనే పాటని కీరవాణి ఆలపించాడు. చిరంజీవి తో సహా అక్కడున్న వాళ్లంతా ఆ పాట వింటు పరవశాన్ని పొందారు. చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో అక్కడ జరిగిన దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అదే విధంగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కీరవాణి కి జన్మదిన శుభాకాంక్షలు కూడా  తెలియచేసాడు.