మాల్యాకు షాక్.. చార్జ్‌షీట్‌​ ఫైల్‌..

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ లో మకాం పెట్టిన విజయ్ మాల్యాను భారత్ రప్పించడానికి ఈడీ కాస్త దూకుడు పెంచింది. లండన్ కోర్టులో మాల్యాకు కాస్త ఊరట లభించింది. విచారణ చేసిన కోర్టు కొద్ది సేపటికే విచారణను వాయిదా వేసింది. అంతేకాదు బెయిల్ గడువును కూడా ఆరునెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లండన్‌‌లోని వెస్ట్ మినిష్టర్ కోర్టులో భారీ ఊరట లభించింది. అయితే ఇప్పుడు విజయ్‌ మాల్యాకు  ఈ సారి గట్టి షాకే తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌( ఈడీ) ముంబై పీఎంఎల్‌ఏ కోర్టులో  బుధవారం మొట్టమొదటి చార్జ్‌షీట్‌​ ఫైల్‌ చేసింది.  ఉద్దేశ పూర్వక భారీ రుణ ఎగవేత దారుడిగా తేలిన మాల్యాపై  ఎట్టకేలకు అధికారంగా ఐడీబీఐ రూ.900 కోట్ల  కేసులో  చార్జ్‌షీటను నమోదు చేసింది.