నా శిరీషది ఆత్మహత్య కాదు..ఎవరో చంపారు..?
posted on Jun 14, 2017 5:43PM

హైదరాబాద్ ఫిలింనగర్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష కేసులో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కృష్ణానగర్‌లో నివసిస్తున్న అరుమిల్లి విజయలక్ష్మీ అలియాస్ శిరీష ఫిలింనగర్‌లోని ఆర్జే ఫోటోగ్రఫీలో బ్యూటీషియన్ కమ్ హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తన కార్యాలయంలోని బెడ్‌పై విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త సతీష్ చంద్ర శిరీష మృతదేహాన్ని చూడగానే కన్నీటి పర్యంతమయ్యాడు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సతీష్ తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మరణం వెనుక అనుమానాలున్నాయని చెప్పాడు. గత సోమవారం రాత్రి 8:40 గంటల సమయంలో నాకు ఫోన్ చేసి ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పిందని, ఆ తర్వాత ఆమె ఆచూకీ లేదన్నాడు. మరోవైపు మరణించడానికి ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లారని ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సంస్థ యజమాని రాజీవ్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. ఒకసారి ఫ్యాన్‌కు ఊరివేసుకుందని..రెండోసారి బాత్రూంలో సూసైడ్ చేసుకుందని చెప్పడంతో పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ శిరీషది ఆత్మహత్యా..? హత్యా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.