అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం...

 

ఈ మధ్య కాలంలో అమెరికా తరచూ కాల్పులు జరుగుతున్న సంగతి తెలసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం...అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్ పార్సిల్ సర్వీస్ కంపెనీ (యూపీఎస్)లో ఓ దుండగుడు విచక్షణారహితంగ కాల్పులు జరిపాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే కాల్పులు జరిపింది యూపీఎస్ ఉద్యోగా ? లేక ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu