పప్పు నుండి నిప్పుకు..


పొలిటికల్ లీడర్ల మీద పడే సెటైర్లే.. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుల్ని నిర్దేశిస్తాయి. ఇది  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయంలో నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీపై ప్రతిపక్ష నేతలు ఏ రేంజ్లో కామెంట్లు విసురుతారో అన్న సంగతి తెలిసిందే. అసలు గూగుల్ లో పప్పు అని కొడితే రాహుల్ గాంధీ వస్తున్నాడంటేనే చెప్పుకోవచ్చు. అయితే రాహుల్ గాంధీ ఈ మధ్య కాస్త మాటలు నేర్చుకున్నట్టు ఉన్నాడు. తన మీద ఉన్న పప్పు అనే ముద్రను తొలగించుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రతిపక్షంపై పదునైన మాటలు వదులుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాహుల్ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా అది మళ్లీ ఆయనపై కామెంట్లు చేసే విధంగానే మాట్లాడేవారు. ఏదో మాట్లాడదామని.. ఏదో మాట్లాడి పప్పులో కాలేస్తూ ఉండేవారు. ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు నిద్ర పోవడం.. అలా చాలాసార్లు బుక్ అవ్వడం.. ఇవన్నీ రాహుల్ పై పప్పు అనే ముద్రను వేశాయి.

 

దీనివల్ల సొంత పార్టీనేతకే రాహుల్ పై నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. ఓ రకంగా చెప్పాలంటే దీనివల్లే పార్టీ పగ్గాలు ఇంకా రాహుల్ చేతికి రాలేదు. కానీ ఇప్పుడు రాహుల్ ఇంతకుముందెన్నడూ లేని విధంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపైనా ప్రధాని మోదీ మీదా పదునైన మాటల బుల్లెట్లు పేల్చుతున్నారు. ''జీఎస్టీ అంటే..  గబ్బర్..  సింగ్..  టాక్స్..! అని.. ''మోదీ గారి ఛాతీ పెద్దది.. హృదయం చిన్నది.. మాట గొప్ప.. మనసు దిబ్బ అని ప్రాసలు ఉపయోగిస్తూ మరీ మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ''మోదీజీ..  ట్రంప్ మీ నుంచి మరో హగ్ కోరుకుంటున్నాడు..  హరియప్..!'' అంటూ రాహుల్ పెట్టిన సెటైరికల్  ట్వీట్స్ కి కుప్పలుతెప్పలుగా రీట్వీట్స్! అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది.  ప్రిన్స్ గారి ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు కూడా. దీంతో ఇదే జోష్ కనుక కంటిన్యూ అయితే.. రాహుల్ పేరు కిందున్న పప్పు అనే ట్యాగ్ లైన్ కొద్దికొద్దిగా చెరిగిపోయ్యే ఛాన్సుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం రాహుల్ ఇదే జోష్ కంటిన్యూ చేస్తాడో.. లేదో..?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu