యూపీలో దారుణం..వ్యాపారవేత్త కుటుంబం కాల్చివేత..దోపిడి

ఉత్తరప్రదేశ్‌లో నేరాలు-ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని నగరం లక్నోకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్‌లో ఓ వ్యాపారి కుటుంబాన్ని దారుణంగా కాల్చిచంపి..నగదు దోచుకెళ్లారు. సునీల్ జైస్వాల్ అనే వ్యాపారి తన పని ముగించుకుని రోజులాగే తన ద్విచక్ర వాహనంపై రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన కుమారుడితో కలిసి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు వాళ్ల చేతుల్లోని బ్యాగ్‌ని లాక్కొవడానికి ప్రయత్నించారు. వారు ఎదురు తిరగడంతో ఇద్దరిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు.

 

ఇంటి ముందు తుపాకి కాల్పులు విన్న వ్యాపారి భార్య పరుగు పరుగున బయటకు రావడంతో ఆమెను కూడా కాల్చేశారు. ఇది చూసిన ఒక స్థానికుడు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో దుండగులు ఆయన మీద కూడా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం నగరమంతా గాలిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఇదే సీతాపూర్‌లో ఓ వ్యాపారి ఇంట్లో దోపిడి యత్నం జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu