జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ చర్చ!

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్  బుధవారం (అక్టోబర్ 9) భేటీ అయ్యింది. ఈ భేటీలో ప్రధానంగా  ఒకే దేశం ఒకే ఎన్నికలు విధానంపై చర్చ జరిగింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా జమిలి ఎన్నికలపైనే చర్చ జరిగింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే విషయంపై కూడా కేంద్ర కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా మంగళవారం (అక్టోబర్ 8) హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించింది.

దీంతో  ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ శ్రేణుుల సంబరాలు నిర్వహించారు. ఆ సందర్భంగా జరిగిన విజయోత్సవ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. హర్యానాలో బీజేపీ విజయాన్ని ప్రజా స్వామ్య విజయంగా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ గతంలో కంటే బెటర్ గా పెర్మార్మ్ చేసిందని ఈ సందర్భంగా మోడీ అన్నారు. మొత్తం మీద