కొండాసురేఖ భుజం మీద రేవంత్ రెడ్డి గన్ 

తన కుటుంబ పరువు దిగజార్చిన మంత్రి కొండాసురేఖ పై సినీ హీరో నాగార్జున వేసిన 100 కోట్ల  పరువు నష్టం దావా , క్రిమినల్ కేసులు ఇప్పట్లో ఆగేట్లు లేవు . ఎంత దూరం తీసుకెళ్తాయో చెప్పలేని పరిస్థితి.  ఒకవేళ కొండా సురేఖ మంత్రి పదవి ఊడినప్పటికీ నాగార్జున మెత్తపడే అవకాశాల్లేవు. ఆయన సీరియస్ గానే కోర్టు ప్రొసీడింగ్స్ ఎదుర్కోబోతున్నారు.  సాక్షాత్తు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బిసీ మంత్రి కొండాసురేఖతో  కెటీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అక్కినేని నాగేశ్వరరావు  గతంలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉండేవారు. అయినా వివాదం ఇంకా సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. వందకోట్ల పరువు నష్టం దావా కేసులో నాగార్జున కోర్టులో పదికోట్లు డిపాజిట్ చేశారు. పరువు నష్టం కేసులో నాగార్జున గెలిస్తే పర్వాలేదు. కానీ ఓడితే మాత్రం పది కోట్లు మునిగిపోయినట్టే. ఈ కేసులో కొండా సురేఖకు శిక్షపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంతిమంగా గెలిచేది నాగార్జున మాత్రమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.  పొలిటికల్  గ్రౌండ్ లో కొండాసురేఖ కెటీఆర్  టార్గెట్ గా  నాగార్జున ఫ్యామిలీపై ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఇక్కడ బలమైన వ్యక్తి కొండాసురేఖ. పైగా ఆమె మంత్రి పదవిలో ఉన్నారు. బిజెపి ఎంపీ రఘు నందన్ రావ్ కొండా సురేఖ మెడలో వేసిన నూలు దండపై బిఆర్ఎస్ సోషల్ మీడియా  చేసిన ప్రచారం కొండాసురేఖ కు బాధకలిగించింది. ఇంత వరకు ఓకే. ఆమె పట్ల సానుభూతి ఉన్నప్పటికీ ఎప్పుడైతే నాగార్జునకుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడటంతో ఇక్కడ బలమైన వ్యక్తి నాగార్జున అయ్యారు. నాగార్జున కోర్టు ప్రాంగణంలో వచ్చినప్పుడే ఆయన ఈ కేసులో గెలుస్తారు అనే నమ్మకం కుదిరింది. తన భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, అక్క సుశీల, మేనకోడలు సుప్రియ తదితరులతో ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. ఫ్యామిలీ కోర్టుకు తన ఫ్యామిలీతో వచ్చిన నాగార్జున ఇక్కడ బలమైన వ్యక్తి అని మరో మారు రుజువయ్యింది. చట్టం అతనికి సపోర్ట్ గా ఉంది. సాక్ష్యులను కొండా సురేఖ ప్రభావితం చేయడానికి కూడా అవకాశాల్లేవ్. మీడియా ఎదుట బహిరంగంగా సమంతను కెటీఆర్ దగ్గరికి వెళ్లాలని నాగార్జున ఆదేశించినట్లు కాదన్న సమంతకు విడాకులు ఇప్పించినట్లు కొండా సురేఖ మాట్లాడిన తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా చేసింది. యావత్ సినీ ఇండస్ట్రీ నాగార్జున కు బాసటగా నిలిచారు. సినీ ఇండస్త్రీకి రెండు కళ్లు ఎన్ టి ఆర్ ,  అక్కినేని నాగేశ్వరరావు అంటారు. సినీ ఇండస్ట్రీ మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చిన ముఖ్యుల్లో అక్కినేని ఒకరు. అటువంటి ఫ్యామిలీపై కొండాసురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద డామేజ్ అని చెప్పొచ్చు. నష్ట నివారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూసుకుంటే మంచిది. తాను క్షమాపణ చెప్పకపోయినప్పటికీ మంత్రి కొండాసురేఖతో క్షమాపణ చెప్పించాలి. ఇంతటితో వివాదం ముగుస్తుంది. ఇంత వరకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంతో నాగార్జున నాంల్లి కోర్టులో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆయన కోర్టు ప్రాంగణంలోకి వచ్చినప్పుడు చిరునవ్వుతో కాన్ఫిడెన్స్ గా కనిపించారు. ఈ కేసును కొట్టివేసే అధికారం జడ్జికి ఎంత మాత్రం లేదు. నాగార్జున కేసును ఉపసంహరించుకుంటే వివాదం పూర్తిగా సద్దుమణగుతుంది. బీసీ మహిళ కార్డుతో రేవంత్ రెడ్డి కొండాసురేఖ భుజం మీద రేవంత్ రెడ్డి గన్  నాగార్జున కుటుంబంపై కాల్పులు జరిపినట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.కొండా సురేఖ కోర్టుకు ఇచ్చే స్టేట్ మెంట్ మీదే ఈ కేసు ఆధారపడింది.