పాక్ కాల్పులు.. విరుచుకుపడ్డ భారత్ సైన్యం..
posted on Jun 1, 2017 10:24AM

భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాక్ కు సరైన విధంగా బుద్ది చెప్పింది భారత్ సైన్యం. జమ్మూ కాశ్మీర్, పూంఛ్ పరిధిలోని నౌషేరా సెక్టారులో పాక్ కాల్పులకు దిగిన వేళ, , భారత సైన్యం వారిపై విరుచుకుపడింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా మాట్లాడుతూ... సరిహద్దుల్లోనే భారత చెక్ పోస్టులే లక్ష్యంగా తేలికపాటి మోర్టార్లు, ఆటోమేటిక్ ఆయుధాలతో పాక్ కాల్పులు జరుపుతుందని..భారత్ దీటుగా సమాధానం ఇస్తోందని, ఇంకా కాల్పులు సాగుతున్నాయని తెలిపారు.
కాగా జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.