టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు.. తెలంగాణ నుంచి?
posted on Sep 17, 2019 3:43PM
టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 28 మందితో టీటీడీ పాలకమండలి ఏర్పాటు అవుతోంది. వీరిలో ఏపీ నుంచి 8 మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఏపీ నుంచి గొల్ల బాబూరావు, ప్రశాంతి, నాదెండ్ల సుబ్బారావు, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్, పార్థసారథి పేర్లను ప్రకటించింది.