నష్టమే తప్ప లాభం లేదు.. విద్యాశాఖ మూసివేత.. ట్రంప్ సంచలన నిర్ణయం
posted on Mar 21, 2025 12:52PM
.webp)
వ్యక్తిత్వ వికాసానికి, మానవాళి పురోగమనానికీ విద్య ఎంతో దోహదం చేస్తుంది. నూతన ఆవిష్కరణలు చేయాలన్నీ, వ్యక్తిత్వం ఉన్నతంగా ఉడేలా మలుచుకోవాలన్న విద్య ఎంతో అవసరం. ప్రభుత్వాలు విద్యపై ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంతగా దేశంలో విద్యాభివృద్ధి జరుగుతుంది. అందుకని దేశంలో విద్యావ్యవస్థను పర్యవేక్షించి, పరిపుష్టం చేయాలంటూ ప్రాథమిక స్థాయి నుంచీ విద్య విషయంలో గట్టి పునాదులు ఉండాలి. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రాన్ని చూసినా ఆయా రాష్ట్రాల బడ్జెట్ లో విద్యకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి. ఆ కేటాయింపుల పారదర్శక వ్యయం కోసం విద్యాశాఖ బలోపేతంగా ఉండాల్సిన అవసరం ఉంది.
అలాంటి విద్యాశాఖ వల్ల మా దేశానికి ఎలాంటి లాభం లేదు. అందుకే ఆ శాఖ అనవసరం అంటూ అగ్రదేశం అశ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యా శాఖ వల్లే ఖర్చే తప్ప లాభం ఇసుమంతైనా లేదంటూ గత కొంత కాలంగా, అంటే అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన విద్యాశాఖలో భారీ కోతలు విధించారు. స్కాలర్ షిప్పులు, ఫీజురాయితీల వల్ల ఖజానాకు చిల్లు పడటం తప్ప ఇసుమంతైనా లాభం ఉండటం లేదంటూ ట్రంప్ తాజాగా దేశంలో విద్యాశాఖనే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ ఈ సంచల నిర్ణయం తీసుకున్నారు.
నాలుగు దశాబ్దాలుగా విద్యపై భారీ మొత్తంలో వ్యయం చేసినా విద్యాప్రమాణాలు ఇసుమంతైనా పెరగలేదన్న ట్రంప్ విద్యాశాఖను మూసి వేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా, విద్యా శాఖను మూసివేస్తూ ఎగ్జిక్యూటివ్ సంతకం చేసేశారు. ఏప్రిల్ నుంచి ఈ మూసివేత అమెరికాలో అమలులోకి వస్తుంది.