యాంకర్ శ్యామలకు చట్టాలంటే గౌరవం లేదా?

 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో నిందితురాలు యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టునాశ్రయించారు. వైకాపా అధికార ప్రతినిధి హోదాలో ఉన్న శ్యామలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అనే విషయం తెలియంది కాదు. కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ నిసిగ్గుగా ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కొరడా జులిపిస్తున్నారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. శ్యామలపై కూడా కేసు నమోదైంది. ఇందులో భాగంగా శ్యామలకు  పోలీసులు నోటీసులు పంపి వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ ఆమె  మాత్రం పోలీసులకు వివరణ ఇవ్వాల్సిందిపోయి న్యాయస్థానం కోర్టుకెళ్లారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చట్టాల పట్ల గౌరవం లేని వైకాపా నేతలపై కేసులు నమోదు కాగానే కోర్టులను ఆశ్రయిం చడం ఈ మధ్యకాలంలో మామూలైంది. కూటమి నేతలను అనుచిత వ్యాఖ్యలు చేసి ఎపిలో 17 పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదైన వైకాపా నేత పోసాని కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి భంగ పడ్డారు. శ్యామలకు కూడా అదే గతి పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.వైకాపాలో కీలకమైన అధికార ప్రతినిధి హోదాలో ఉండి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమేమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. 
 కాగా కేసులు నమోదైన టీవీ యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి స్టేషన్ కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.