టీఆర్ఎస్ సర్పంచ్ మృతి ఎందుకో తెలుసా..? 

కరోనా వాళ్ళను కబళించలేదు. బ్లాక్ ఫంగస్ చుట్టూ మూటలేదు. అలా అని వాళ్ళను ఎవరు చంపలేదు, చేతబడి చేయలేదు, ఇంట్లో వేసి అన్నం పెట్టకుండా బండిచలేదు. గుండె పోట్టు లాంటివి రాలేదు. కానీ, ప్రకృతి వాళ్లపై పగపట్టింది. కాలం వాళ్ళని పడుకున్న ఇంట్లోనే రక్తంతో తడిపింది. రాత్రి ఇంట్లో పడుకున్న నానమ్మ, మనుమడు తేరుకోలేని నిద్రలోకి వెళ్లిపోయారు.  

అది వనపర్తి జిల్లా. రేవల్లి మండలం. బండరావిపాకుల సర్పంచ్ ఆమె పేరు లచమ్మ. తన వయసు  51 సంవత్సరాలు. తన మనవడు యోగేశ్వర్. ఆ బాలుడి వయసు  12  సంవత్సరాలు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు వేరువేరు గదులలో నిద్రించ‌గా సర్పంచ్ లచ్చమ్మ, తన మనవడు యోగేశ్వర్ 12  తో కలిసి మరో గదిలో నిద్రించారు. అర్థరాత్రి దాటిన తర్వాత సర్పంచ్, ఆమె మనవడు నిద్రిస్తున్న గది పైకప్పు ఒక్కసారిగా కూలి కిందపడటంతో వారు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. వల్ల దురదృష్టం కాకపోతే అందరూ ఇంట్లోనే పడుకున్నారు.. కానీ వెళ్లి పడుకున్న గది కూలి మృతిచెందారు. బుధవారం ఉదయం మిగతా కుటుంబ సభ్యులు లేచి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఇల్లు కూలింది అన్న విషయం గుర్తించి తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు ఇద్దరు మట్టిలో కలిసిపోయారు. కుటుంబ సభ్యులంతా గొల్లుమని ఏడ్చారు. గ్రామం అంత సర్పంచ్ మరణం పట్ల చలనం లేకుండా ఉండిపోయారు. 

సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. బండ రాయిపాకుల ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. రాత్రి ఇలా జరగడంతో గ్రామం మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి. తెల్లవారు జామున మట్టి మిద్దె కూలి మృతి చెందారు. ఇటీవల సర్పంచ్ మట్టి మిద్దె పై చౌడు వేశారు. పైగా కప్పును మోసే దూలాలు, వాట్లు దెబ్బ తిన్నాయి. ఉదయం మిగతా కుటుంబ సభ్యులు లేచి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఇల్లు కూలింది అన్న విషయం గుర్తించి తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు ఇద్దరు మృతి చెందారు. గ్రామ సర్పంచ్‌తో పాటు ఆమె మనవడు దుర్మరణం పాలయ్యారు. మిద్దె కూలి ఇద్దరు మృతి చెందారు.