టార్గెట్ లతో చులకనైపోతున్న కె.సి.ఆర్.

తెలంగాణా రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్..) అధినేత కేసీఆర్ నోరు తెరిచారా ప్రత్యేక తెలంగాణాకు టార్గెట్ ఫిక్స్ అయినట్లే. ఇలా టార్గెట్లు పెట్టే కేసీఆర్ టి.ఆర్.ఎస్.ను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు నెత్తీనోరు బాడుకున్తున్నాయి. తమకే తెలియని విషయాలు అసలు మాట్లాడకుండా ఉండమని ఎంత చెప్పినా కేసీఆర్ వినటం లేదని గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటిదాకా కేసీఆర్ ఎన్నో టార్గెట్లు పెట్టి తెలంగాణలో చులకన అయ్యారని వాపోతున్నారు. ఒక్కసారి కూడా ఆ టార్గెట్ ప్రకారం ఏ పనీ జరగలేదనీ తెల్చేస్తున్నాయి. ఈసారి టి.ఆర్.ఎస్. శ్రేణులకు చెప్పకుండానే కేసీఆర్ మరోసారి తెలంగాణాకు టార్గెట్ విధించేశారు. అదేమిటంటే పరకాలలో నెగ్గిన మూడునెలలకే సోనియా సహకారంతో ప్రత్యేక తెలంగాణా వస్తుందని హామీ ఇచ్చేశారు. దీన్ని అన్ని పార్టీలూ సీరియస్ గా తీసుకున్నాయి. అంతేకాకుండా విమర్శల వర్షం కురుస్తోంది. బిజెపి, టిడిపి, కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కేసీఆర్ పై ధ్వజమెత్తాయి. ఓటు కోసం కేసీఆర్ కొత్తనాటకానికి తెర ఎత్తారని, ఒకవేళ పరకాలలో టి.ఆర్.ఎస్. గెలిచినా తరువాత మూడు నెలల్లోపు తెలంగాణా తెలేకపోతే కేసీఆర్ ముక్కు నేలకేసి రాస్తారా అని తెలంగాణా వచ్చేస్తుందని అంతఖచ్చితంగా చెప్పటానికి ఆధారమేమిటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర పార్టీల నేతలూ ధ్వజమెత్తారు. అసలు కేసీఆర్ టార్గెట్ పెడితే దాన్ని ఓటర్లు కానీ, ఇంకెవరూ కూడా నమ్మలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో విభేదించిన కేసీఆర్ మళ్ళీ సోనియా జపం చేయటం ప్రజల్ని మభ్యపెట్టడమేనంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మా కేసీఆర్ ఇటువంటి టార్గెట్లు పెట్టి లొల్లి చేయకుండా చూసుకుంటామని టి.ఆర్,ఎస్. నేతలే ఓటర్లకు సర్దిపుచ్చుతున్నారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నంత అరకూ మా కేసీఆర్ ఇలానే కలలు కన్తారని కూడా వారు నొక్కి చెప్పటం గమనార్హం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu