జగన్ కు ముందున్నది ముళ్ళబాట ...

జగన్ కు ముందున్నది ముళ్ళబాట ...

ఉచ్చు బిగుస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్

ఆదాయానికి మించి ఆస్తులను కలిగివున్న కేసులో అరెస్టు అయిన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని కష్టనష్టాలను ఎదుర్కోబోతున్నాడు. జగన్ సంస్థలకు విదేశాలనుంచి అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయల నిధులు వచ్చి చేరాయి. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించింది. దేశంలోనే అత్యంత కఠినమైన చట్టాలుగా భావిస్తున్న ఫారిన్ ఎక్స్చేంక్ రెగ్యులేటరీ యాక్టు, మనీలాండ్రింగ్ చట్టాలను ఆయనపై ప్రయోగించటానికి అధికారులు సిద్ధపడుతున్నారు. జగన్ కు విదేశాల నుంచి అక్రమ మార్గంలో నిధులు వచ్చినందున ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి పంపించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టును అభ్యర్థించబోతున్నారు.

 

 

సాక్షి మీడియా సంస్థల్లోకి నిధులు వచ్చినట్టే తమిళనాడు లోని కరుణానిధికి చెందిన టి.వి. న్యూస్ ఛానల్ కు కూడా నిధులు వచ్చాయి. తమిళనాడులో ఆ టెలివిజన్ ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. ఆ మాదిరిగానే పార్టీ ఆస్తులను ఇ.డి. జప్తు చేసే ప్రమాదం ఉంది. నిజానికి సిబీఐ పెట్టిన కేసులు కొంచెం బలహీనంగా ఉండి జగన్ తప్పించుకునేందుకు అవకాశాలున్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెట్టే కేసుల్లో జగన్ తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశంలేదు. ఆయనను అరెస్టు చేస్తే ఏడాదిన్నర నుంచి రెండేళ్ళపాటు బెయిల్ కూడా లభించదు. ఈ కేసులలో శిక్షపడితే పదేళ్ళ వరకూ జైలుజీవితం అనుభవించాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా కేసుల నుంచి రెండేళ్ళపాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులు ఆ తరువాత ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఎన్ ఫోర్స్ మెంట్ కేసుల వల్ల జగన్ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu