ఉప్పల్ అభ్యర్థిని మార్చనున్న తెరాస అధిష్టానం..!!
posted on Sep 8, 2018 11:59AM

తెరాస తెలంగాణలోని 119 స్థానాలకు గాను తొలివిడతగా 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ జాబితాలో చోటు దక్కని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. వారిలో ఒకరు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్.. బొంతు ఉప్పల్ టిక్కెట్ ఆశించారు.. అయితే ఆ స్థానంలో తెరాస అభ్యర్థిగా భేతి సుభాష్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు.. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తమకు అభ్యర్థిత్వం దక్కకపోవడంపై బొంతుతో పాటు ఆయన కుటుంబసభ్యులు తీవ్ర నిరాశకు గురైనట్టు తెలిసింది.. ఈ నేపథ్యంలో ఉప్పల్ అభ్యర్థిగా ప్రకటించిన భేతి సుభా్‌షరెడ్డికి నచ్చచెప్పి ఆయన స్థానంలో రామ్మోహన్‌కు అవకాశం కల్పించే అంశాన్ని అగ్రనాయకులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.. కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ఆయన ఆమోదిస్తే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.