కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు..!!

 

ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన కొండా దంపతులు తరువాత పార్టీని వీడారు.. ప్రస్తుతం తెరాస లో ఉన్న కొండా దంపతులు టిక్కెట్ల విషయంలో ఆ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.. రీసెంట్ గా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ముందస్తుకు ముందడుగు వేసిన సంగతి తెల్సిందే.. అయితే తొలి జాబితాలో కొండా సురేఖ సీట్ పెండింగ్ లో పెట్టారు.. కొందరు ఆమెకి టిక్కెట్ డౌట్ అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఇదే కొండా దంపతుల అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.. కూతురు సుశ్మితాపటేల్‌కు భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశమివ్వాలని సురేఖ తెరాస అధిష్ఠానాన్ని కోరారు.. ఆ అభ్యర్థనను కేసీఆర్‌ సున్నితంగా తిరస్కరించారు.. ఇస్తే ఇద్దరికీ టికెట్లు ఇవ్వాలని, లేకపోతే లేదని సురేఖ చెప్పడంతో ఆమె సిట్టింగ్‌ స్థానం వరంగల్‌ తూర్పును పెండింగ్‌లో పెట్టారు.. దీంతో కొండా దంపతులు తెరాసని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. త్వరలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ సమక్షంలో కొండా దంపతులు కాంగ్రెస్‌ కండువా కప్పుకొనేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu