ప్రభుత్వం ఫై ద్వజమెత్తిన హరీష్ రావు

మెదక్: ప్రభుత్వం రూ.1కే కిలో బియ్యం అంటూ మక్కి పోయిన బియ్యం ఇస్తుందని వాటిని ఎలా తినగలరని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్ రావు ఆదివారం మెదక్ జిల్లాలో ప్రశ్నించారు.కిలో బియ్యం పథకం ఉత్తుత్తి పథకమే అన్నారు. ఒక చేత్తో రూపాయికి కిలో బియ్యం అంటూ మరో చేత్తో కిరోసిన్, చక్కెరపై కోత విధిస్తున్నారని కాంగ్రెసు ప్రభుత్వంపై ద్వజమెత్తారు. జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని  అన్నారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను మళ్లించారని ఆయన ఆరోపించారు. ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే టిఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. బాబుకు తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా మద్దతిస్తే కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందని సూచించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu