బాలయ్య రాజకీయ ప్రవేశంపై నో రెస్పాన్స్

రాజమండ్రి: బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షా సేథ్ తదితరులు నటిస్తున్న ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రం షూటింగు పశ్చిమ గోదావరి జిల్లాలోని బ్రాహ్మణ చెరువు శివారులో జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రికి వచ్చిన అక్కడ ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిరుచిగల నిర్మాతలు ముందుకు వస్తే తాను మరిన్ని పౌరాణిక చిత్రాల్లో నటిస్తానని చెప్పారు. శ్రీరామరాజ్యం చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.తన రాజకీయ రంగ ప్రవేశంపై  విలేకరులు ప్రశ్నించగా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. శ్రీరామరాజ్యం సూపర్ హిట్ కావడంతో ఆ ఆనందంలో ఉన్న బాలయ్య ఇప్పటికిప్పుడు రాజకీయాలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదేమే! కాగా బ్రాహ్మణ చెరువు శివారులో షూటింగ్ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడకు వచ్చిన అభిమానులు కాబోయే ముఖ్యమంత్రి బాలయ్య జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu