భాజపా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నది : లగడపాటి
posted on Nov 20, 2011 11:25AM
విజ
యవాడ: ప్రత్యేక తెలంగాణా విషయంలో భాజపాజ పచ్చి మోసపూరిత వైఖరిని అవలంభిస్తోందని అందువల్ల వందేళ్ళు అయినాదేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. తెలంగాణ అంశంపై ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని చెందిన ఆయన జోస్యం చెప్పారు.దీనిపై ఆయన మాట్లాడుతూభాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణా ఇస్తామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని, యూపీ విభజన విషయంలో మాత్రం ఆ పార్టీ నేతలు పూటకొక విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.విభజనపై ఇష్టానుసారంగా నిర్ణయాలు చేయరాదని ఎల్కే.అద్వానీ అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీనే సరైన మార్గమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అభిప్రాయపడుతున్నారన్నారు. ఇటువంటి ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్న భాజపా వందేళ్లైనా తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వనేలేదన్నారు.
ఇకపోతే.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఏర్పాటు చేసిన సద్భావన సదస్సుకు సమైక్యవాదిగానే హాజరైనట్టు చెప్పారు. ఈ సదస్సుకు తెలగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ కూడా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అపుడే ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గుతాయన్నారు.