ఉచ్చు బిగుసుకుంటోందా?

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ ఆవినాష్ రెడ్డిని సీబీఐ అధికారుల విచారణ తరువాత  చోటు చేసుకొంటున్న పరిణామాల వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. సీబీఐ అధికారులు.. దాదాపు నాలుగున్నర గంటల పాటు   అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ సందర్భంగా అవినాష్ రెడ్డి సీబీఐ ప్రశ్నలకు వా  సమాధానం చెప్పినా..  వివేకా దారుణ హత్య తరువాత  అవినాష్ రెడ్డి పోన్ నుంచి వెళ్లిన కాల్ డేటా మాత్రం..  ఈ విచారణలో అత్యంత కీలకంగా మారిందని అంటున్నారు.

ఆ క్రమంలో ఈ కాల్ డేటాపై సీబీఐ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన అవినాష్ రెడ్డి.. ఎవరెవరికి కాల్ చేసిందీ పూసగుచ్చినట్లు చెప్పేశారని వైసీపీలోని ఒక వర్గం అంటున్నది.  మరీ ముఖ్యంగా రెండు నెంబర్లకు అనినాష్ రెడ్డి ఫోన్‌ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. వాటిపై అవినాష్ రెడ్డిని గుచ్చి గుచ్చి ప్రశ్నించగా.. ఆ నెంబర్లు ఎవరివో  ఆయన సీబీఐ అధికారులకు వెల్లడించారని అంటున్నారు. ఆ రెండు నంబర్లలో ఒకటి తాడేపల్లి ప్యాలెస్ లో  అత్యంత కీలక వ్యక్తికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్‌దని..  ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతితో మాట్లాడాలంటే.. ముందుగా నవీన్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి చెప్పినట్లు  అధికార పార్టీలోని ఓ వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.

దీంతో దీంతో వివేకా హత్య జరిగిన రోజు.. ఆ తర్వాత   అవినాష్ రెడ్డి పలు మార్లు సీఎం సతీమణి భారతితో  మాట్లాడినట్లు సీబీఐ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారనీ...  అందుకే నవీన్ కు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు. అంతే కాకుండా   నాటి విపక్ష నేత   జగన్‌తో మాట్లాడాలంటే..  మరో వ్యక్తికి ఫోన్ చేయాల్సి ఉంటుందని... అతడు ప్రస్తుతం ముఖ్యమంత్రి   జగన్ వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా సీబీఐ అధికారులకు కడప ఎంపీ   అవినాష్ వివరించినట్లు సదరు వర్గంలో చర్చ సాగుతోంది.    

ఈ నేపథ్యంలోనూ నవీన్‌తోపాటు ఆ వ్యక్తికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారని.. అంటున్నారు. అయితే   ఏ రోజు.. ఏ సమయంలో   విచారణకు హాజరుకావాలి.. అనే అంశాలను మాత్రం సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొనలేదంటున్నారు. ఏది ఏమైనా నవీన్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తే..   వివేకా హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందనీ...  ఆ తర్వాత సీఎం సతీమణికి  భారతీకి సైతం నోటీసులు జారీ చేసే అవకాశం లేకపోలేదని వైసీపీలోని ఓ వర్గం భావిస్తోంది. 

 వివేకా హత్య జరిగిన రోజు.. సాక్ష్యాలు చేరిపేసేందుకు కడప ఎంపీ వైయస్ అవినాష్ ప్రయత్నించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి.. అలాగే వివేకా హత్య కేసులో ప్రస్తుత సీఎం  జగన్ హస్తం ఉందంటూ ఇప్పటికే హు కిల్డ్ బాబాయి అంటూ ప్రతిపక్షాలు.. వివిధ సందర్భాల్లో... పలు వేదికలపై నుంచి బహిరంగంగానే  నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు స్కెచ్ చేసిన సూత్రధారుల పని పట్టేందుకు సీబీఐ అధికారులు లోతైన విచారణ జరపాలని నిర్ణయించారని.. ఆ క్రమంలో సీబీఐ అధికారుల విచారణకు వైసీపీలోని  కీలక వ్యక్తులు తెరపైకి రానున్నారనే ఓ చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.