కామారెడ్డి ఘటనలో ముగ్గురు దుర్మరణానికి కారణం ఇదే...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువులో ముగ్గురు దుర్మరణానికి మిస్టరీ వీడింది.  బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.  ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , ఎస్ఐ సాయికుమార్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాట్లాడుకోవడానికి వీరు చెరువు వద్దకు చేరుకున్నారు.  ముగ్గురి మధ్య మాటామాటా  పెరగడంతో శృతి చెరువులోకి దూకేసింది. ఆమెను కాపాడటానికి నిఖిల్ దూకేసాడు. వీరిద్దరికి ఈత రాదు. వీరిని కాపాడటానికి ఎస్ ఐ సాయికుమార్ చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో సాయికుమార్ నీటిలో మునిగిపోయాడు. శృతి ఆత్మహత్య చేసుకుంటే నిఖిల్ , సాయికుమార్ రక్షించే క్రమంలో మునిగిపోయారు.