సంక్రాంతి తరువాత షెడ్యూల్.. ఫిబ్రవరిలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి తరువాత వెలువడే అవకాశం ఉంది.   మొత్తం  మూడు విడతల్లో  ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే  జరగనున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా  12,815 గ్రామ పంచాయతీలు, 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు  కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొమ్ము చేసుకుని పంచాయతీ ఎన్నికలలో జయకేతనం ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో  కాంగ్రెస్ సర్కార్ ఉంది.  

ఇప్పటికే  పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో  సత్తా చాటేందుకు భారీ ప్రణాళిక రూపిందించింది.    ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించి పూర్తి నివేదిక అందింది.  ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సమాయత్తమౌతోంది.  

ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచు ల పదవీ కాలం ముగియగా, జూలై 3వ తేదీన ఎం పిటిసి, జడ్పిటిసి సభ్యుల పదవీ కాలం ముగిసిం ది. దీంతో అప్పటి నుంచీ స్థానిక ప్రజాప్రతి నిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో ఎన్నికల కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేప డుతోంది.  జనవరి 14వ తేదీన ఎన్నికల షెడ్యూల ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపిటిసి స్థానాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.