దీపావళి పండుగ రోజు ఈ బహుమతులు ఎవరికీ ఇవ్వకూడదు..!
posted on Oct 29, 2024 9:30AM
దీపావళి అంటే వెలుగుల పండుగ. దీన్ని దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా దేశాలలో ఎంతో సంబరంగా జరుపురుకుంటారు. దీపావళి పండుగ అంటే చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తు. భారతదేశంలో చాలామంది ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడమే కాకుండా పండుగ రోజు తమ ఆత్మీయులకు, సన్నిహితులకు బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. అవేంటంటే..
దుస్తులు..
నచ్చిన వారికి, స్నేహితులకు, ఆత్మీయులకు దుస్తులను బహుమతిగా ఇవ్వడం చాలామంది చేస్తారు. అయితే నలుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వడం, వాటిని బహుమతిగా స్వీకరించడం కూడా మంచిది కాదు. ఇది అరిష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు.
బంగారు, వెండి..
దీపావళి పండుగ రోజున బంగారం, వెండి నాణేలను కొలుగోలు చేయడం చాలామంది చేసే పని. ఆ రోజు లక్ష్మి పూజ కూడా చేసుకుంటారు. అయితే దీపావళి సందర్భంగా బంగారం, వెండి కొనే వారు వారు మాత్రమే కొనుగోలు చేయవచ్చట. బంగారం, వెండిని ఇతరులకు బహుమతులుగా ఇవ్వడం మంచిది కాదట.
పదునైన వస్తువులు..
పదునైన పస్తువులు రోజువారీ చాలా ఉపయోగిస్తుంటారు. వంటగదిలోనూ, ఇంటి ఉపయోగం కోసం ఉపయోగించేవే అయినా దీపావళి రోజు అలాంటి వస్తువులను అస్సలు బహుమతిగా ఇవ్వడం, వాటిని బహుమతిగా అందుకోవడం అస్సలు మంచిది కాదట.
పాద రక్షలు..
దీపావళి కానుకగా చెప్పులు, బూట్లు వంటివి బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదని అంటున్నారు.
గడియారం..
కాలమానాన్ని సూచించే గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం మంచిది కాదట. ఆప్తులకు, తెలిసిన వారికి చాలామంది ఇచ్చే బహుమతులలో చేతి గడియారం, గోడ గడియారం వంటివి ఉంటాయి. వీటిని అస్సలు బహుమతిగా ఇవ్వకూడదని అంటున్నారు. ఇలా గడియారాన్ని ఇతరులకు బహుమతిగా ఇస్తే మన మంచి కాలం ముగిసిపోయినట్టే అని కూడా అంటున్నారు.
*రూపశ్రీ.