అనంతపురంలో టెస్లా కార్ల ఫ్యాక్టరీ?
posted on Oct 15, 2024 12:08PM
ఎలాన్ మస్క్ సూపర్ కార్ ‘టెస్లా’ ఎప్పుడెప్పుడు ఇండియా రోడ్ల మీద పరుగులు తీస్తుందా అని చాలామంది ఇండియన్స్ ఎదురుచూస్తున్నారు. టెస్లా కంపెనీని ఇండియాకి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్‌లో టెస్లా ఫ్యాక్టరీని స్థాపించాలని సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో వున్నప్పుడు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించే సమయంలో జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వం హయాంలో ఆల్రెడీ ఉన్న కంపెనీలే పారిపోయే పరిస్థితి వచ్చింది. టెస్లా కోసం ప్రయత్నించినవాళ్ళే లేరు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో టెస్లా కంపెనీ మీద ఏపీ జనంలో ఆశలు చిగురించాయి. ఇదే ప్రశ్నను నేషనల్ మీడియా జర్నలిస్టు మంత్రి లోకేష్‌ని అడిగినప్పుడు, టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చే కృషి కొనసాగుతుంది. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల ఏపీకి రావడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి అన్నారు. ఇదిలా వుంటే, టెస్లా కార్ల కంపెనీ అనంతపురంలో ఏర్పాటయ్యే అవకాశాలు వున్నాయని సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది.