వర్షం ముప్పు.. మంత్రి నిమ్మల అలెర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి నిమ్మల రామానాయుడు అలర్ట్ అయ్యారు. అధికారులను అలర్ట్ చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులతో మంత్రి రామానాయులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నాలుగు రోజుల్లో ఎంత వర్షం కురిసే అవకాశం వుంది.. ఎంత నీరు వస్తుంది అనే అంచనాలు వేసి, దానికి అనుగుణంగా ఫ్లడ్ మానేజ్మెంట్, వాటర్ మానేజ్మెంట్ చేయాలని అధికారులకు సూచించారు. వాగులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రిజర్వాయర్లకు ఎంత నీరు వస్తుందనేది అంచనావేసి ఆనకట్టల పటిష్టతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మంత్రి నిమ్మల రాత్రిబవళ్ళు దగ్గరుండి పనులను పర్యవేక్షించిన విషయం తెలిసిందే.