సజ్జలపై లుక్ అవుట్ నోటీసు!
posted on Oct 15, 2024 12:24PM
వైసీపీ సలహాదారుడు, జగన్ ప్రభుత్వం హయాంలో సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ తిరిగిపోయే షాక్ తగిలింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయినట్టు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాంపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్టు చెబుతున్నారు. లుక్ అవుట్ నోటీస్ కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని, తలశిల, లేళ్ల అప్పిరెడ్డి నిందితులుగా ఉన్నారు. తనకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనమీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని సజ్జల వాపోతున్నట్టు తెలుస్తోంది.