జర్మనీలో తెలుగు విద్యార్థి దుర్మరణం
posted on Jan 1, 2026 10:07PM

జర్మనీలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన తోకల హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీవెళ్లాడు. అతడు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భవనం పై అంతస్తు నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
అతడి వయస్సు 24 ఏళ్లు. చదువుల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన తోకల హృతిక్ రెడ్డి మృతి వార్త తెలియడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది ఈ అగ్నిప్రమా దం ఎలా సంభవించిందనే అంశంపై జర్మనీ పోలీసులు విచారణ చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో భద్రతా చర్యల్లో లోపాలున్నాయా? అగ్నిమాపక వ్యవస్థ పనిచేసిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.