యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక మలుపులు

 

హిందూ దేవతలను కించపరిచే విధంగా వీడియో కంటెంట్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారా లను సేకరించేందుకు పోలీసులు సోషల్ మీడియా సంస్థలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పంజా గుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి అధికారిక లేఖ రాశారు. యూట్యూబర్ అన్వేష్ దేవుళ్లపై చేసిన వివాదాస్పద వీడియోలకు సంబంధించిన కంటెంట్ లింకులు, అన్వేష్‌కు చెందిన యూజర్ ఐడీ, అకౌంట్ వివరాలు, వీడియోలు అప్‌లోడ్ చేసిన తేదీలు, ఐపీ అడ్రస్ సమాచారం వంటి కీలక వివరాలను అందిం చాలని కోరారు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ సంస్థ నుంచి స్పందన కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి పూర్తి సమాచారం అందిన వెంటనే అన్వేష్‌పై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచా రణలో అన్వేష్ విదేశాల్లో నివసిస్తూ భారతీయ చట్టా లకు విరుద్ధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. భారతదేశంలో మత విశ్వా సాలు, ప్రజాభావాలను దెబ్బతీసే విధంగా కంటెం ట్‌ను ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని పోలీ సులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారికి కఠిన చర్యలు తప్ప వని పోలీసులు హెచ్చరిస్తు న్నారు.

అన్వేష్ వీడియోలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హిందూ సంఘాల నాయకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు అందజే శారు. హిందూ దేవతలపై అభ్యంత రకర వ్యాఖ్యలు చేసి మత భావాలను కించపరిచారని ఆరోపిస్తూ అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఈకేసుకు కీలకంగా మారింది. ఆమె ఫిర్యాదులో అన్వేష్ వీడి యోలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, హిందూ సమాజాన్ని అవమా నపరిచేలా ఉన్నాయని కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను సహించ బోమని పోలీసులు స్పష్టం చేశారు. దేశంలో ఉన్న చట్టాలు అందరికీ సమానమని, విదేశాల్లో ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొ న్నారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి సమాచారం అందిన తరువాత అవసరమైతే లుక్‌ఔట్ నోటీసులు, అంతర్జాతీయ సహకారం దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగు తున్న నేపథ్యంలో ఇంకా సోషల్ మీడియాలో వివాదాస్పద కంటెంట్‌పై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu