అసెంబ్లీలో చర్చ లేకుండానే 5 బిల్లులు ఆమోదం
posted on Jan 2, 2026 1:42PM

తెలంగాణ అసెంబ్లీలో మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్ వర్సిటీలు, మోటార్ వైహిల్ ట్యాక్సేషన్ చట్టాల సవరణలను సంబంధించి 5 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండా శాసన సభలో ఈ బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఇందులో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన 3 కీలక బిల్లులున్నాయి. సీఎం, ట్రాన్స్‌ఫోర్టు మినిస్టర్ల తరపున ఈ బిల్లులను సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు.
మూజువాణి ఓటుతో సభ వీటికి ఆమోదం తెలిపింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి గడ్డం ప్రసాద్ పక్షపాతి వైఖరికి నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల బహిష్కరించనున్నట్లుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం తమకు సభలో మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత కాలినడకన ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోకి వెళ్లి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.