ఎట్టకేలకు తెలంగాణ సర్కారుకు ఊరట..
posted on Aug 29, 2016 3:48PM
ఎట్టకేలకు వీసీల నియామకంపై తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నెలరోజుల క్రితం తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్‌లను నియమిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు ఆగిన వాళ్లు ఇంకా రెండు రోజులు ఆగలేకపోయారా అంటూ మొట్టికాయలు వేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయవాదులు ముఖుల్‌రోహత్గీ, విశ్వనాథ్‌శెట్టి కోర్టులో తమ వాదనలు వినిపించారు. వాదనల విన్న సుప్రీం కొత్త వీసీల కొనసాగింపునకు సుప్రీంకోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు వీసీని నియమించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని తెలిపింది.