నేడు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ
posted on Dec 16, 2014 9:04AM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఆరుగురు సభ్యులతో కూడిన జాబితాను గవర్నర్ నరసింహన్‌కి పంపించారు. ఈ జాబితాలో తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం జిల్లా), ఎ.ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్ జిల్లా), అజ్మీరా చందూలాల్ (వరంగల్ జిల్లా), జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్ జిల్లా), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్) పేర్లున్నాయి. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి మంత్రివర్గ విస్తరణ ఇది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తారు.