తెలంగాణ బడ్జెట్ విశేషాలు
posted on Mar 11, 2015 11:55AM

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015 - 2016 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి లక్షా 15 వేల 689 కోట్ల బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విశేషాలు ఇలా వున్నాయి.
* రాష్ట్రబడ్జెట్ రూ. లక్షా 15 వేల689 కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ. 52వేల383 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 63వేల 306 కోట్లు
* ఆర్థిక మిగులు రూ. 531 కోట్లు
* ద్రవ్య లోటు రూ.16,969 కోట్లు
* 2014-15లో ఆర్థికాభివృద్ధి 5.3 శాతం
* 14వ ఆర్థిక సంఘం గుజరాత్, తెలంగాణ రాష్ర్టాలను మిగులు బడ్జెట్ రాష్ర్టాలుగా గుర్తించింది.
* బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు... అంకెల కూర్పు అసలే కాదు
* ప్రతీ పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేటాయిస్తాం
* గత తాత్కాలిక బడ్జెట్ అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచింది.
* అమరవీరుల త్యాగానికి వినమ్రంగా తలవంచుతున్నాం
* 481 మంది అమరుల కుటుంబాలకు రూ. 48.12 కోట్లు ఆర్థిక సహాయం
* హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.416 కోట్లు కేటాయించాం.
* ఎఫ్‌ఆర్‌బీఎంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరాం.
* ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధుల మళ్లింపునకు గురయ్యాయి.
* ఉద్యమ భారం మోసిన వారి ఆంక్షలకు అనుగుణంగా రూపొందించిన ఆర్థిక ప్రణాళిక ఇది.
* బీడీ కార్మికులకు రూ. 188 కోట్లు
* ఈ నెల నుంచి బీడీ కార్మికులకు రూ. 1000 భృతి అందిస్తున్నాం
* యాదగిరి గుట్టకు రూ. 100 కోట్లు
* మైనార్టీలకు రూ.1,165 కోట్లు
* బీసీలకు రూ.261 కోట్లు
* గిరిజనుల సంక్షేమానికి రూ. 2878 కోట్లు
* పంచాయితీరాజ్ శాఖ రోడ్ల అభివృద్దికి రూ. 2421 కోట్లు
* ఆసరా పెన్షన్ల కోసం రూ. 4 వేల కోట్లు
* ఆహార భద్రత సబ్సిడీ రూ. 2,200 కోట్లు
* స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ. 771 కోట్లు
* రోడ్ల అభివృద్ధికి రూ. 2421 కోట్లు
* కేంద్రం నుంచి రూ. 11, 781 కోట్లు రావాల్సి ఉండగా 4,147 కోట్లు మాత్రమే వచ్చాయి.
* కేంద్రం పన్నుల వాటా రూ. 12,823 కోట్లు
* జీహెచ్‌ఎంసీకి రూ. 526 కోట్లు
* వాటర్ గ్రిడ్‌కు రూ. 4000 కోట్లు
* మిషన్ కాకతీయకురూ. 2083 కోట్లు
* జంట నగరాల్లో తాగు నీటికి రూ. 1000 కోట్లు
* ఆటవీ, పర్యావరణ శాఖకు రూ. 325 కోట్లు
* సాగునీటికి రూ. 8500 కోట్లు
* రాష్ర్టాభివృద్ధికి పారిశ్రామికాభివృద్ధి చాలా అవసరం
* పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహకాల కోసం రూ. 974 కోట్లు
* ప్రభుత్వం వద్ద సాగుకు పనికిరాని భూమి 20 లక్షల ఎకరాలు అందుబాటులో ఉంది.
* ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ
* హైదరాబాద్ - వరంగల్ మధ్య ఇండస్ట్రీయల్ కారిడార్
* పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే మా లక్ష్యం
* పరిశ్రలకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నాం
* విద్యా రంగానికి రూ. 11,216 కోట్లు
* ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు రూ. 22,889 కోట్లు
* ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 238 కోట్లు
* హాస్టల్లకు 2200 కోట్లు
* మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం కేటాయించినప్పటి నుంచి స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ తగ్గాయి.
* ఉద్యోగుల ఆశలకు అనుగూణంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాం. బంగారు తెలంగాణలో ఉద్యోగులు పునరంకితం కావాలి.
* పశు, ఉద్యానవన, వ్యవసాయ వర్సిటీలకు రూ. 261 కోట్ల*
* అంగన్వాడీ టీచర్ల కార్యకర్తల వేతనాలు రూ. 7 వేలకు పెంపు
* అంగన్‌వాడీ ఆయాల వేతనం రూ. 4500కు పెంపు
* పెరిగిన అంగన్‌వాడీ టీచర్ల, కార్యకర్తల జీతాలు మార్చి 2015 నుంచి అమలు
* ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి రూ. 1000 వన్‌టైమ్ స్పెషల్ గ్రాంట్
* తెలంగాణలో వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం
* డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది.
* వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో సంస్కరణలు చేపడుతున్నాం.
* వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లో ఈ-మార్కెటింగ్ వేలం నిర్వహిస్తున్నాం.
* ఎర్రజొన్న రైతులకు 11.5 కోట్లు చెల్లించాం
* రూ.480 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాం.
* రుణమాఫీ కోసం రూ.4,800 కోట్లకు పైగా నిధులు బ్యాంకులకు చెల్లించాం.
* 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ
* ఈ సంవత్సరం రైతు రుణ మాఫీ కోసం రు. 4,250 కోట్లు
* వ్యవసాయ అనుబంధ రంగానికి రూ. 8,432 కోట్లు
* డ్రిప్ ఇరిగేషన్‌కు రూ. 200 కోట్లు
* చిన్ననీటి పారుదల శాఖకు రూ. 200 కోట్లు
* గిడ్డంగులకు రూ. 403 కోట్లు
* మార్కెటింగ్ శాఖకు రూ. 411
* విద్యుత్ రంగానికి రూ. 7400 కోట్లు
* 2018 నాటికి విద్యుత్ ఉత్పత్తి సమార్థ్యం 23,670 మె.వా చేయాలని లక్ష్యం
* కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
* విద్యుత్ శాఖకు రూ. 7400 కోట్లు
* విద్యుత్ రంగాన్ని సంస్కరించేందుకు తొలి అడుగులు పడ్డాయి.
* ఫ్లై ఓవర్లకు రూ. 1600 కోట్లు
* హరిత హారానికి రూ. 325 కోట్లు
* ఎస్సీ, ఎస్టీ భూముల కొనుగోలు కోసం 1000 కోట్లు
* ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం రూ. 400 కోట్లు
* మెట్రో రైలుకు రూ. 416 కోట్లు
* వైద్య, ఆరోగ్య సేవల కోసం రూ. 4932 కోట్లు
* నెల ఖర్చుల కోసం నగర పోలీస్‌స్టేషన్లకు రూ.75 వేలు
* జిల్లా కేంద్రాల్లోని పోలీస్‌స్టేషన్‌లకు రూ. 50 వేలు
* మండల కేంద్రాల్లోని పోలీస్‌స్టేషన్‌లకు రూ. 25 వేలు