బాయ్‌కాట్ చేస్తున్నామని డ్రామాలాడొద్దు: నాగం
posted on Nov 21, 2011 3:41PM
హైదరా
బాద్: తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవాలి లేదా రాజీనామాల్ని ఆమోదించుకోవాలలి కానీ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని డ్రామాలాడొద్దని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యల కోసం దేశరాజధానికి వెళ్లిన చంద్రబాబు, తెలంగాణ సమస్య పరిష్కారానికి ఎప్పుడు ఢిల్లీ వెళుతారోనన్నారు.
కిరణ్ ప్రభుత్వం యుపి సిఎం మాయావతిని ఆదర్శంగా తీసుకొని ఈ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రాంతంలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని సూచించారు. పార్లమెంటులో ఈ శీతాకాలపు సమావేశాలలో బిల్లు పెట్టకుంటే ప్రజల నుండి యుద్ధం తప్పదన్నారు. ఉద్యమం సద్దుమణిగిందని భావించవద్దని ఇది కేవలం తుఫాను ముందు ప్రశాంతత మాత్రమేనన్నారు.