రేణుక చౌదరి కుమార్తె వివాహంపై తెలంగాణవాదుల రగడ
posted on Apr 18, 2012 4:51PM
ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి కుమార్తె వివాహం ఆదివారం హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కాగా జిల్లానుంచి రాజకీయ అరంగేట్రం చేసి, దశాబ్దాకాలంపైగా హవా కొనసాగించిన రేణుక తన కుమార్తె వివాహానికి ఇక్కడి నాయకులను ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కలకు పోస్టులో ఆహ్వాన పత్రికలందడంతో కంగుతిన్నారు. రేణుకా అనుచరులు, అభిమాన కార్యకర్తలకు సైతం ఆహ్వానం అందకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. చెప్పాపెట్టకుండా శుభకార్యాన్ని కానిచ్చేసిన రేణుక తీరు పట్ల ఆమె వర్గీయులు ఆందోళనలో పడ్డారు. ఇదేంటి ఇలా చేశారంటూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ విశ్లేషణలు మొదలుపెట్టారు.